Gold Prices Today : దిగు.. దిగు..మరింతగా దిగు బంగారమా... మా దిగులు తీరుతుందమ్మా

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గి కొంత అందుబాటులోకి వచ్చాయి.

Update: 2024-06-11 03:33 GMT

బంగారం ధరలు ప్రతి రోజూ పెరుగుతుండటం సాధారణమే. అది పెద్ద సంచలన వార్త కాదు. ఎందుకంటే బంగారానికి ఉన్న ప్రత్యేక లక్షణం ధరలు పెరగడమే కానీ తగ్గడం కాదు. బంగారం ధరలు తగ్గిందంటే ఆరోజుకు అది గుడ్ న్యూస్ అవుతుంది. ప్రతి రోజూ బంగారం ధరలలో మార్పులు, చేర్పులు కనిపిస్తుంటాయి. దానికి అనేక కారణాలుంటాయి. అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పు కనిపిస్తుంటుంది.

వెండి కూడా...
బంగారంతో పాటు వెండి కూడా పరుగులు తీయడం సాధారణంగా కనిపించేదే. ఒక దశలో కిలో వెండి ధర లక్ష రూపాయలు దాటేసింది. వెండి కొనుగోలు చేయాలన్నా మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలకు భారంగా మారింది. సహజంగా బంగారం, వెండి వస్తువులు తమ ఇళ్లలో ఉంటే వాటిని శుభంగా చూస్తారు. దానికంటే వాటి విలువ, అది తెచ్చే స్టేటస్ సింబల్ కోసం ఎక్కువ మంది కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. పెట్టుబడిగా చూసేవారు చాలా మంది ఉండటంతో బంగారం, వెండి ధరలు మరింత ప్రియమవుతున్నాయి.
పెరుగుతుందని...
ఈ ఏడాది పది గ్రాముల బంగారం ధరలు ఎనభై వేల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే గత కొద్ది రోజులుగా బంగారం నేల చూపులు చూస్తుంది. ధరలు దిగివస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గి కొంత అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,690 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,660 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి దరల 96,300 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News