Gold Prices Today : బంగారం ధరలు తగ్గాయోచ్.. ఇంతకంటే మంచి వార్త ఏముంటుంది?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గి కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.

Update: 2024-06-17 03:06 GMT

దేశంలో బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇటీవల స్పష్టం చేసింది. ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసే దేశంగా భారత్ ముందుందని చెప్పకనే చెప్పింది. బంగారం ధరలు పెరగడానికి ఇక్కడ కొనుగోళ్లు కూడా అధికమవ్వడమే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం కారణంగా బంగారం ధరలు నిత్యం మారుతుంటాయి.

ఆభరణాల కొనుగోలుకే...
బంగారాన్ని కొనుగోలు చేయడం అంటే ఆషామాషీ కాదు. కానీ భారత్ లోనే ఇది సాధ్యమవ్వడానికి కొనుగోలు శక్తి కూడా పెరగడం ఒక కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఇతర దేశాల కంటే భారత్ లో బంగారం, వెండి సంప్రదాయాల్లో భాగంగా ఒకటిగా మారడంతో ఇక్కడ కొనుగోళ్లు అధికంగా ఉన్నాయని చెబుతారు. ఆభరణాలను కొనుగోలు చేయడం కూడా ఇక్కడే ఎక్కువగా కనపడుతుంది. గోల్డ్ బిస్కెట్లు, గోల్డ్ బాండ్స్ కంటే ఆభరణాలకే భారతీయులు మొగ్గు చూపుతుంటారు.
స్వల్పంగా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గి కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. వరసగా గత కొద్ది రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తుండటంతో కొనుగోళ్లు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,490 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,540 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 95,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News