Gold Prices Today : ఇంతకంటే మంచి న్యూస్ ఏముంటుంది? కొనుగోలుకు సరైన టైం గురూ

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత తగ్గాయి.

Update: 2024-06-25 03:32 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. తగ్గవన్నది మాత్రం అందరికీ తెలిసిందే. బంగారానికి పెరగడమే తెలుసు. తగ్గడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే తగ్గినప్పుడే బంగరాన్ని కొనుగోలు చేయడం మంచిది. లేకుంటే రానున్న కాలంలో ధరలు అందుబాటులో లేకుండా పోతాయి. కొనాలన్నా ఇక కొనలేని పరిస్థితి. బంగారం, వెండి అంటేనే భారతీయులు అత్యంత ఎక్కువగా ఇష్టపడతారు. ఎంతగా అంటే ఎంత ఉన్నా తనివి తీరనంతగా కొనుగోలు చేయడం భారతీయులకు అలవాటు. దీనికి తోడు సంస్కృతీ సంప్రదాయాలు కూడా బంగారం, వెండి కొనుగోళ్లను పెంచుతున్నాయి.

ప్రతి పండగకూ...
ప్రధానంగా పండగలు, పబ్బాలు మాత్రమే కాదు.. పెళ్లిళ్లే.. కాదు... శుభకార్యాలే కాదు.. ఈరోజుల్లో ఇంట్లో ఎవరి పుట్టిన రోజు పండగ అయినా సరే బంగారాన్ని కొనుగోలు చేయడం హాబీగా మారింది. అందుకే కొనుగోళ్లు పెరిగాయి. బంగారం నిల్వలు తగినంత లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ ధరలు మాత్రం అదుపులోకి వస్తాయని మాత్రం ఎవరూ ఊహించడం లేదు. ఇప్పుడు అన్ సీజన్ లోనే ఇలా ఉంటే ఇక సీజన్ ప్రారంభమయితే ఆగస్టు నెల నుంచి బంగారం ధరలు మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు, కిలో వెండి ధర లక్ష రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
తగ్గడంతో...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత తగ్గాయి. ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత ప్రియమవుతాయి. అన్ సీజన్ కావడంతో జ్యుయలరీ దుకాణాలు ఆఫర్లు కూడా భారీగానే ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,240 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,220 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 96,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.



Tags:    

Similar News