Gold Prices Today : మాఘమాసం ఎంట్రీతో గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి

Update: 2024-02-10 04:07 GMT

పసిడి ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. అందుకే దానికి కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఆర్థిక స్థోమత ఎంతో అవసరం. కొన్ని వర్గాలకు పసిడి ఎప్పుడో దూరమయి పోయింది. సాధారణ, మధ్యతరగతి ప్రజలకు అందనంత దూరంలో పసిడి ధరలున్నాయి. ఇష్టంగా ఉన్నా ధరలను చూసి కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇక కేవలం ఎగువ మధ్యతరగతి, ధనికులకు మాత్రమే బంగారం సొంతమయ్యే పరిస్థితులు రాను రాను నెలకొంటాయన్నది కాదనలేని వాస్తవం.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
నేటి నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. మూడు నెలలు వరసగా పెళ్లిళ్లు. ఈ మూడు నెలలు బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయి. భారతీయ సంస్కృతిలో వివాహ వేడుకలో బంగారం ఒక భాగం కావడంతో బంగారం లేనిదే పెళ్లిళ్లు జరగని పరిస్థితి. అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇక పెట్టుబడి కోసం కొనుగోలు చేసే వారు కూడా బంగారాన్ని ఎక్కువగానే కొనుగోలు చేస్తుండటంతో ధరలు మరింత పెరిగనున్నాయని అంటున్నారు.
స్వల్పంగానే...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,890 రూపాయలుగా నమోదయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,150 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 76,600 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.




Tags:    

Similar News