Gold Price Today : హమ్మయ్య...గురువారం కొంత శాంతించింది.. కొనేసుకోవచ్చిక

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి.

Update: 2024-07-04 03:58 GMT

బంగారం ధరలు రోజురోజుకూ ప్రియమవుతున్నాయి. వెండి ధరలు కూడా బంగారం వెంటే పరుగులు తీస్తున్నాయి. బంగారం పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారనుంది. గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న ఒడిదుడుకులతో పాటు ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటివి బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. రాను రాను బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఆషాఢమాసమయినా...?
ప్రస్తుతం రెండు రోజుల్లో ఆషాఢమాసం రానుంది. ఆషాఢంలో ముహూర్తాలుండవు. ఇక ఆగస్టు నెల నుంచి ముహూర్తాలు ఊపందుకుంటాయి. అయితే ఆషాఢమాసంలోనూ కొన్ని శుభకార్యాలు చేసుకునే వీలుంది. ఇళ్లలో జరిగే శుభకార్యాలయాలకు బంగారం, వెండికొనుగోళ్లకు ఎక్కువ మంది ఉత్సాహం చూపుతుంటారు. అందుకే జులై నెల నుంచే బంగారం, వెండి విక్రయాలు ఊపందుకుంటాయని బంగారు దుకాణాల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆగస్టు నెల వచ్చిందంటే అమ్మకాలు మరింత ఊపందుకుంటాయని అందుకు అవసరమైన సరుకును సిద్ధం చేసుకుంటున్నారు వ్యాపారులు.
వెండి మాత్రం....
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై ఇరవై రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. గత రెండు రోజుల నుంచి ధరలు పెరగడం, తగ్గడం జరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,340 రూపాయలుకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారరం ధర 72,370 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 96,100 రూపాయలుగా నమోదయింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు ఉన్న ధరలు మాత్రమే ఇవి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News