Gold Prices Today : కొనుగోలు చేయాలంటే ఇదే మంచి సమయం.. లేకుంటే కష్టమే మరి

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి

Update: 2024-07-29 02:26 GMT

బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే .. ఇంత భారీ స్థాయిలో మునుపెన్నడూ బంగారం ధరలు తగ్గలేదు. వచ్చేది శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా ఎక్కువగా ఉండటంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ధరలు తగ్గడంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. కొనుగోళ్లు కూడా పెరిగాయి. దీంతో ధరలు మరింత ప్రియమవుతాయని చెబుతున్నారు. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని వ్యాపారులు కూడా సూచిస్తున్నారు. రానున్న కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముండటంతో ఇప్పటికే ముందస్తు ఆర్డర్లు ఇస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

ఆషాఢం వెళ్లిపోతుండటంతో...
ఆగస్టు 5వ తేదీ నుంచి ఆషాఢమాసం వెళ్లిపోయి శ్రావణమాసం ప్రారంభం కానుంది. అందులో ఈ మాసంలో మహిళలు తాము అత్యంత ఇష్టపడే వరలక్ష్మీ పూజలు కూడా నిర్వహించడానికి సిద్ధం చేసుకుంటున్నారు. శ్రావణమాసంలో తాము జరిపే పూజలకు బంగారం తోడయితే మరింత మంచిదని భావిస్తున్నారు. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు మరింత పెరుగుతాయి. దానికి తోడు ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ధరలు పెరగక ముందే కొనుగోలు చేయడం మంచిదని అందరూ సూచిస్తున్నారు. ఇప్పటికే డిమాండ్ కు తగ్గ బంగారం నిల్వలు లేకపోవడంతో ధరలు పెరిగే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయడం లేదు.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఎలాంటి మార్పు లేదు. ధరలు తగ్గడానికి కేంద్ర బడ్జెట్ ప్రధాన కారణం. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,240 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,990 రూపాయలుగా కొనసాగుతుంది. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 88,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News