Gold Price Today : శుక్రవారం బంగారం ధరలు దిగివచ్చాయ్.. గుడ్ న్యూస్ కదా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Update: 2024-08-23 02:20 GMT

బంగారం ధరలు తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి. నిలకడగా ఎప్పుడూ కొనసాగవు. పసిడికి ఉన్న గిరాకీని బట్టి వాటి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. పుత్తడిని ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటారు. ముఖ్యంగా శ్రావణమాసంలో లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి ఆ విగ్రహానికి కొత్త బంగారు ఆభరణాలు వేస్తే శుభసూచకమని భావిస్తారు. దీంత పాటు పెళ్లిళ్లు, శుభకార్యాల వంటివి కూడా ఆగన్టు నెలలో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలలో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతాయి. అయితే ఈ శ్రావణ మాసంలో అనుకున్న స్థాయిలో ధరలు పెరగకపోవడం ఒక రకంగా సంతోషకరమైన విష‍యమేనని చెప్పుకోవలి.

ఈ నెలలో డిమాండ్ ఎందుకంటే?
శ్రావణ మాసంలో శుభకార్యాలకే కాకుండా పూజల నిమిత్తం బంగారాన్ని కొనుగోలు చేయడం ఎక్కువ. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అమ్మవారికి బంగారు ఆభరణాలను ధరింప చేస్తే మంచిదని భావించి ఎక్కువగా ఈ కాలంలోనే కొనుగోళ్లు చేస్తుంటారు. ఇక మార్కెట్ లో కొత్త కొత్త డిజైన్లలతో రారమ్మని పసిడి ఊరిస్తుంటాయి. జ్యుయలరీ దుకాణాలు పోటీ పడి మరీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు తమ వంతు  ప్రయత్నాలు చేస్తుంటాయి. రాయితీలు ప్రకటిస్తుంటాయి. ఒక్కసారి జ్యుయలరీ దుకాణంలోకి అడుగుపెడితే ఇక కొనకుండా వెనుదిరిగి వెళ్లరు. అందుకే ధరలు పెరుగుతాయని భావించి ముందుగానే కొనుగోలు చేయడం హాబీగా మార్చుకున్నారు.
స్వల్పంగా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. మొన్న బుధవారం అయితే ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. ఈరోజు పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఉదయం ఆరు గంటల వరకే ఈ ధరలు. తర్వాత పెరగొచ్చు. తగ్గొచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,790 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,860 రూపాయలకు చేరుకుంది. వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతూ ప్రస్తుతం మార్కెట్ లో కిలో ధర 92,080 రూపాయలుగా నమోదయింది.


.


Tags:    

Similar News