Gold Prices Today : తగ్గిన బంగారం ధరలు... పెరిగిన వెండి ధరలు.. అయితే స్వల్పంగానే సుమా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కొద్దిగా పెరుగుదల కనిపించింది
దేశంలో బంగారం ధరలకు రెక్కలు ఉంటాయి. అవి పెరుగుతూనే పోతుంటాయి. కిందకు చూడటం అనేది అరుదుగా జరుగుతుంటుంది. బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ పెద్దగా ఆలోచించకపోవడంతో ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. పెరిగితే భారీగా, తగ్గితే తక్కువగా ధరలు ఉండటం బంగారానికి ఉన్న ప్రధమ లక్షణం. అందుకే భారీగా ధరలు పెరగకముందే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. ఆఫ్ సీజన్ అయినా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల మాత్రం ఆగడం లేదు.
రానున్న కాలంలో...
ఈ స్థాయిలో బంగారం ధరలు పెరుగుతాయని ఇప్పటికిప్పుడు అంచనాలు వేయలేమంటున్నారు వ్యాపారులు కూడా. ధరలు పెరగడం ప్రారంభిస్తే ఆగవన్నది అందరూ చెబుతున్న మాట. ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరుగుతుండగా, కిలో వెండి ధర లక్ష రూపాయలకు చేరువలో ఉంది. ఇక ఆగస్టు నెల నుంచి సీజన్ ప్రారంభం కానుండటంతో ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. అందుకే ధరలు ఇంకా పెరగక ముందే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
నేటి ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కొద్దిగా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,000 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల 73,090 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 97,500 రూపాయలుగా ఉంది.