Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. ఇది కదా? సరైన టైం కొనుగోలు చేయడానికి
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆషాఢమాసంలో బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు కూడా విపరీతంగా పెరిగాయి. జ్యుయలరీ దుకాణాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఆషాఢమాసమైనా.. రానున్నది శ్రావణమాసం కావడంతో ముందుగాకొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు ప్లాన్ చేసుకుంటున్నారు. ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న ఆలోచనలో క్యూ కడుతున్నారు. రానున్నది శ్రావణమాసం కావడంతో ధరలు మరింత ప్రియమవుతాయన్న హెచ్చరికలతో ఇప్పుడే కొనుగోలు చేయడం మేలన్న ఆలోచనలో చాలా మంది పసిడికొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
మరో వారం రోజుల్లో...
ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ముహూర్తాలు కూడా ప్రారంభమవుతాయి. పెళ్లిళ్లు, గృహప్రవేశాలతో పాటు శ్రావణమాసం పూజల కోసం కూడా మహిళలు తమకు అత్యంత ఇష్టమైన బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గాయి. దీంతో బంగారం, వెండి సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో అనేక మందికి ముందుకు వస్తున్నారు. దీంతో తమ గిరాకీలు కూడా బాగా పెరిగాయని జ్యుయలరీ దుకాణాల వ్యాపారులు చెబుతున్నారు.
తగ్గిన ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై యాభై రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై రెండు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,190 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,940 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 88,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. అయితే ఇది ఆరు గంటల వరకూ ఉన్న ధరలు మాత్రమేనని మధ్యాహ్నానికి మార్పులు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.