Gold Prices Today : హమ్మయ్య ఈరోజు కొంత తగ్గింది.. ఇక కొనేయొచ్చుగా
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వ్పలంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి
బంగారం ధరలు ఎప్పుడు పడిపోతాయో? ఎప్పుడు పెరుగుతాయో? ఎవరూ చెప్పలేరు. పసిడి ధరల్లో మార్పులకు అనేక కారణాలుంటాయి. అంతర్జాతీయంగా మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలు కూడా ధరలు పెరుగుదల, తగ్గుదలకు కారణాలవుతుంటాయి. ధరలు పెరుగుదలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసే వస్తువు పసిడి కావడంతో ప్రజలు కూడా వీటిని పట్టించుకోవడం మానేశారు.
అందుకే పసిడిని...
బంగారం అనేది స్టేటస్ సింబల్ గా మారింది. మన వద్ద ఎంత బంగారం ఉంటే అంత ఆర్థిక భద్రత అని భావిస్తున్న వారు ఇటీవల కాలంలో మరింత పెరిగిపోయారు. అవసరం వచ్చినప్పుడు వెంటనే బంగారాన్ని నగదుగా మార్చుకునే వీలుంది. తమ అవసరాల కోసం కుదువ పెట్టైనా నగదును తెచ్చుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత దానిని ఇంటికి తీసుకురావచ్చు. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. కేవలం మంచి ధర వచ్చినప్పుడు విక్రయించడానికే కొందరు కొనుగోలు చేయడం కూడా కనపడుతుంది.
నేటి ధరలు...
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వ్పలంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,840 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,420 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 79,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.