Gold Price Today : బంగారం కొనేయాలంటే ఈరోజే కొనేయండి.. ఈరోజు ధరలు తగ్గాయ్

ఇక ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది

Update: 2024-08-20 04:22 GMT

పసిడి ధరలు ఎవరికీ అందనంత దూరంలో వెళుతున్నాయి. బంగారం అంటే అంతే మరి. ధరలు పెరగడం మామూలే అయినా సీజన్ కావడంతో పెరుగుతున్నాయిలే అని సరిపెట్టుకునే వారు అనేక మంది ఉన్నారు. కానీ ధరలు పెరుగుతున్నా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. దీనికి ప్రధాన కారణం అవసరాలు, కుటుంబంలో జరిగే శుభకార్యాలకు పసిడి, వెండి కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుండటంతో వాటిని కొనుగోలు చేయడం తప్పడం లేదు. దీంతో డిమాండ్ అధికమై బంగారం ధరలు ఇప్పటికే పది గ్రాములు 72 వేల రూపాయలు దాటింది. ఇక వెండి ధరలు కూడా లక్షకు చేరువలో ఉన్నాయి.

మళ్లీ పెరుగుతూ...
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాల వల్ల ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కస్టమ్స్ సుంకం ఆరు శాతం తగ్గించడంతో కొన్ని రోజుల పాటు బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. మొన్నటి వరకూ తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గడం కొంత శుభసూచకమే అయినా పెరిగినంత మాత్రం ధరలు తగ్గడం లేదు. దీంతో వినియోగదారులు ఎక్కువ మొత్తం చెల్లించి పసిడిని కొనుగోలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.
నేటి ధరలు....
ఇక ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై ఈరోజు పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,760 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 85,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News