Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు
నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి
పసిడి ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి. వెండి ధరలు కూడా దాని వెంటే పరుగులు తీస్తుంటాయి. బంగారం, వెండి వస్తువులకు ఉన్న డిమాండ్ అలాంటిది. దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. గోల్డ్ బిస్కట్లు కొనుగోలు చేసేవారు తక్కువ. ఆభరణాలను కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. అందుకే జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటుంది.
రకరకాల డిజైన్లతో....
ఇక పెళ్లిళ్ల సీజన్ లో అయితే చెప్పలేం. తమకు కావాల్సిన డిజైన్ ను ముందుగా ఆర్డర్ ఇస్తే వాటిని సకాలంలో అందిస్తూ కస్టమర్లను తమ దుకాణాలవైపు ఆకట్టుకుంటున్నాయి. కొత్త కొత్త డిజైన్లు.. రకరకాల ఆభరణాలతో జ్యుయలరీ దుకాణాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వినియోగదారులను రప్పించుకుంటున్నాయి. ఇక ధరలు పెరుగుదలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే రానున్న కాలంలో ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు చేస్తున్న హెచ్చరికలతో ఇటీవల కాలంలో కొనుగోల్లు పెరిగాయంటున్నారు.
స్పల్పంగా తగ్గి...
నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో పది గ్రాముల బంగారం ధరపై దాదాపు 1400 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర పై సుమారు ఐదు వేల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,640 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,790 రూపాయల వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,200 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.