Gold Prices Today : రండి బాబూ రండి.. బంగారం కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం

దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగానే తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గాయి

Update: 2024-06-28 03:41 GMT

గోల్డ్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. లోహాల్లో కల్లా అతి విలువైన ప్రియమైనది బంగారం మాత్రమే. ఈ వస్తువుకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగానే బంగారం, వెండికి అత్యంత గిరాకీ ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేస్తుండటమే ఇందుకు కారణం. గతంలో కొద్ది రోజుల్లోనే బంగారానికి డిమాండ్ ఉండేది. కానీ ప్రజలకు కొనుగోలు శక్తి పెరగడంతో ఎప్పుడు డబ్బులు చేతిలో ఉంటే అప్పుడు బంగారం, వెండి సొంతం చేసుకునేందుకు ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అందుకే బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అన్ సీజన్ లోనూ...
మరోవైపు ప్రస్తుతం అన్ సీజన్ నడుస్తుంది. మంచి ముహూర్తాలు లేవు. ఆగస్టు నెలలో కానీ ముహూర్తాలు ప్రారంభం కావు. అయినా సరే బంగారం, వెండి కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. గతంలో పెళ్లిళ్లకు మాత్రమే కొనుగోలు చేేసే బంగారు ఆభరణాలను, ఇప్పుడు పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా తమ కుటుంబంలో వచ్చే ప్రతి మంచిరోజును బంగారంతో పండగ చేసుకోవడం ప్రజలు అలవాటుగా మార్చుకున్నారు. దీంతో బంగారం, వెండి వస్తువులు సీజన్ తో సంబంధం లేని డిమాండ్ ఉన్న వస్తువులుగా మారిపోయాయి మరోవైపు దిగుమతులు కూడా భారీగా తగ్గడం, కొనుగోళ్లు పెరగడంతో బంగరాం ధరలు భవిష్యత్ లో మరింత పెరుగుతాయని చెబుతున్నారు.
భారీగా తగ్గి...
అయితే బంగారం ధరలు కొన్ని రోజుల నుంచి తగ్గుతున్నాయి. స్వల్పంగానే దిగినా ఎక్కువ రోజులు బంగారం ధరలు తగ్గడంతో కొంత ధరలు అందుబాటులోకి వచ్చాయంటున్నారు. గత వారం రోజుల్లో పది గ్రాముల బంగారం ధరపై పదహారు వందల రూపాయల వరకూ ధర తగ్గింది. ఈరోజు దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగానే తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,740 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,720 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 94,400 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News