Gold Prices Today : ఎంతటి శుభవార్త... గోల్డ్ లవర్స్ కు అదిరిపోయే న్యూస్ ఇది

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే ఎక్కువ మొత్తంలోనే తగ్గాయి

Update: 2024-06-27 03:40 GMT

బంగారం ధరలు తగ్గాయని తెలిస్తే అంతకంటే మంచి వార్త ఉండదు. కొనుగోలు చేయకపోయినా బంగారం అందుబాటులోకి వస్తుందన్న సంతృప్తితో అనేక మంది ఇలాంటి వార్తల కోసమే ఎదురు చూస్తుంటారు. ఇక కొనుగోలు చేసే వారి ఆనందం చెప్పాల్సిన పనిలేదు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు అందరూ పాటిస్తారు. అవసరాలకు తప్పించి, బంగారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలనుకున్న వారు మాత్రం బంగారం ధరలు దిగివచ్చినప్పుడే కొనుగోలు చేయడం ఎప్పుడూ జరుగుతుంటుంది. ఎందుకంటే తగ్గినప్పుడు కొనుగోలు చేస్తే తమకు ఇష్టమైన ఆభరణాన్ని తక్కువ డబ్బులతో సొంతం చేసుకోవచ్చన్న ఆశ వారిలో కనిపిస్తుంది.

ఎప్పుడూ ప్రియమే...
ఇక బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. ఎందుకంటే దిగుమతులు లేకపోవడం, కొనుగోళ్లకు తగినంతగా బంగారం నిల్వలు లేకపోవడంతో ధరలు ఎప్పుుడూ పెరుగుతూనే ఉంటాయి. ధరలు అప్పుడప్పుడూ అదుపులోకి వస్తుంటాయి. కొన్ని సార్లు స్థిరంగా, తక్కువ సార్లు తగ్గుతూ పసిడి ప్రియులను ఊరిస్తుంటాయి. అందుకే తగ్గినప్పుడే బంగారం ధరలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సీజన్ వచ్చిదంంటే ఇక ధరలను అదుపు చేయడం ఎవరి చేతిలోనూ ఉండదు. ఆగస్టు నెల నుంచి మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నేటి ధరలు ఇవీ...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే ఎక్కువ మొత్తంలోనే తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర పై 260 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయల వరకూ తగ్గింది. గత ఐదు రోజుల నుంచి బంగారం ధరపై 1,250 రూపాయలు తగ్గిందంటే మాటలు కాదు. అందుకే గోల్డ్ లవర్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,990 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 94,400 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News