Gold Prices Today : గుడ్ న్యూస్.. ధరలు తగ్గాయ్.. శ్రావణం కంటే ముందే కొనేసేయండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.

Update: 2024-07-20 04:18 GMT

బంగారం ధరల్లో ప్రతి రోజూ మార్పులు చోటు చేసుకుంటాయి. హెచ్చుతగ్గులు ఉంటాయి. అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు నిత్యం పెరుగుతుంటాయి. కొద్దిసార్లు తగ్గుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు వంటివి పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. తగ్గితే ధరలు తక్కువగా, పెరిగితే ధరలు ఎక్కువగా పెరుగుతుంటాయి.

ధరలు పెరుగుతూ...
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దిగుమతులు తక్కువగా ఉండటంతో పాటు కొనుగోళ్లు పెరుగుతుండటంతో ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వెండి మొన్న కిలో లక్ష రూపాయలుకు చేరుకుంది. బంగారం పది గ్రాముల ధర కూడా 75 వేల రూపాయల వరకూ వెళ్లింది. ఇక ఆషాఢమాసం పూర్తయి శ్రావణ మాసం ప్రారంభమయితే ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. బంగారం, వెండి ధరలు కొంత తగ్గడంతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. శ్రావణమాసం కంటే ముందే కొనుగోలు చేయడానికి వినియోగదారులు సిద్ధమవుతున్నారు. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,140 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 74,340 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 93,150 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News