Gold Rates : కొనుగోళ్లు లేకపోతే... ఏం జరుగుతుంది... తగ్గడం తప్ప

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

Update: 2023-12-13 03:17 GMT

Gold rates

బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదంటారు. భూమికి ఎంతటి విలువ ఉంటుందో పసిడికి కూడా అంతే విలువ ఎప్పుడూ ఉంటుందనేది వాస్తవం. అయితే భూముల ధరలు కూడా రియల్ ఎస్టేట్ రంగం మంచి బూమ్ లో ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. కొనుగోళ్లు లేక నిలిచిపోతే వాటి ధరలు కూడా నేల చూపులు చూస్తాయి. బంగారంలోనూ అదే జరుగుతుందనిపిస్తుంది. బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తుండటానికి కారణం కొనుగోళ్లు మందగించడమేనని చెబుతున్నారు.

కొనుగోళ్లు తగ్గి...
అధిక ధరలను పెట్టి బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఎవరూ ఇష్టపడరు. అదేమీ రోజూ ఉపయోగించే వస్తువు కాదు. కేవలం స్టేటస్ సింబల్ గా మాత్రమే చూస్తారు. అలాంటి పసిడి కోేసం ఎక్కువ ధరలను పెట్టి ఉన్న డబ్బును వస్తువు రూపంలో మార్చుకునే సాహసానికి ఎవరూ ఒడిగట్టరు. ఇక పెళ్లిళ్ల వంటి శుభకార్యాలను మినహాయిస్తే తప్ప ఎవరూ జ్యుయలరీ షాపుల వైపు కూడా తొంగి చూడరు. అదే సమయంలో అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కూడా ధరలు తగ్గడానికి కారణమవుతాయి.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 220 రూపాయలు తగ్గింది. వెండి ధరల్లో కూడా తగ్గుదల స్వల్పంగా కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,750 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61చ910 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 77,700 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News