Gold Prices Today : అబ్బా.. ఎంత ధరి తగ్గిందో.. ఇది వింటే ఇక కొనేయకుండా ఉంటారా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వ్పలంగా తగ్గాయి. వెండి ధరలలో కూడా కొంచెం తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. నిరంతరం పెరగడమే బంగారానికి తెలిసినంత మరే వస్తువుకు తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బంగారానికి, వెండికి ఉన్న డిమాండ్ అటువంటిది. బంగారం ధరలు పెరిగితే వేలల్లో పెరుగుతుంది. తగ్గితే మాత్రం పదో పరకో తగ్గి సంతృప్తి పర్చాలని చూస్తుంది. అంతే తప్ప బంగారం ధరలు తగ్గాయని సంబరపడే వారికి ఈ ధరలు పెద్దగా స్వాగతం పలికేవి కావు. అయితే అవసరం ఉన్నోళ్లు మాత్రం విధిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
మిగిలిన రాష్ట్రాల్లో...
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ తెలుగు రాష్ట్రాల్లో లేదు. మూఢమి కావడంతో ఇక్కడ మరో రెండునెలలు వకూ మంచి ముహూర్తాలు లేవు. అయితే కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అక్కడ సంప్రదాయాల ప్రకారం మూఢమి వివాహాలకు అడ్డంకి కాకపోవడంతో అక్కడ బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం మీద దేశంలో ఎక్కడో ఒక చోట పసిడి, వెండికి ఉన్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అందుకే ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వ్పలంగా తగ్గాయి. వెండి ధరలలో కూడా కొంచెం తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,750 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 1,00,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.