Gold Price Today : బంగారం అంతే మరి.. ఒకసారి పరుగు అందుకుంటే ఇక అంతేగా?
దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.
దేశంలో బంగారం, వెండికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా బంగారం, వెండిని ఎగబడి మరీ కొనుగోలు చేస్తుంటారు. బంగారం, వెండి ఉంటే శుభప్రదమని నమ్మేవాళ్లు కొందరయితే.. అది కష్టకాలంలో మనల్ని ఆదుకుంటుందని మరికొందరు భావిస్తారు. మరో రకం వాళ్లు కూడా ఉన్నారు. పొదుపు కోసం.. బంగారాన్ని పెట్టుబడిగా చూసేవాళ్లు అధికంగా ఉన్నారు. పెట్టుబడిగా చూసేవాళ్లు మాత్రం గోల్డ్ బిస్కెట్లను కొనుగోలు చేస్తారు. మిగిలిన వర్గాల ప్రజలు మాత్రం బంగారు ఆభరణాల కొనుగోలుకే మొగ్గు చూపుతారు.
కొనుగోళ్లు మాత్రం...
అందుకే పుత్తడికి ఎప్పుడూ భారతదేశంలో డిమాండ్ అనేది తగ్గదు. దానికి ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది. ప్రస్తుతం మూఢమి నడుస్తున్నా, ముహూర్తాలు లేకపోయినా బంగారం ధరలు పెరుగుతున్నాయంటే అందుకు ప్రధాన కారణం కొనుగోళ్లు ఏమాత్రం తగ్గకపోవడమే కారణమన్న విశ్లేషణలు బలంగా వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఏడాది పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.
నేటి ధరలు...
దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,290 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,500 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర మాత్రం 99,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.