Gold Prices : ఇలా అయితే బంగారాన్ని ఎవరైనా కొనుగోలు చేస్తారా... మీరైనా చెప్పండి?
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కన్పించింది
బంగారం ధరలు తగ్గాయని సంతోషించిన సమయం పట్టలేదు. మళ్లీ పెరగడానికి. మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. నిన్న ఒక్కరోజు బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఆనంద పడ్డారు. పెళ్లిళ్ల సమయంలో తమకు కొంత కలిసి వస్తుందని భావించారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. పెరిగినప్పుడు అధికంగా, తగ్గినప్పుడు స్వల్పంగా ధరలు ఉండటం బంగారం విషయంలో మామూలే అయినప్పటికీ.. ఏదో ధరలు తగ్గాయని ఆనందం తప్ప మరొకటి కాదు.
అవసరమైతే తప్ప...
బంగారం కొనుగోళ్లు గతంలో మాదిరి మాత్రం లేవు. అవసరం ఉంటే తప్ప... బాగా బ్యాగ్ నిండా డబ్బులుంటే తప్ప బంగారం కొనుగోలు చేయాలన్న ఆలోచన కూడా రావడం లేదు. ఎందుకంటే దానిని కొనుగోలు చేసే శక్తి తగ్గిపోవడంతో పాటు అంత అవసరమా? అన్న భావన కొనుగోలుదారుల్లో నెలకొంది. బంగారాన్ని పెట్టుబడిగా చూసేవారు కూడా ధరలను చూసి భయపడి మ్యూచ్‌వల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి కొనుగోళ్లు కొంత తగ్గినా ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు.
మళ్లీ పెరిగాయి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కన్పించింది. పది గ్రాముల బంగారం ధరపై 110 రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై మూడు వందల రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,400 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,260 రూపాయలుగా కొనసాగుతుంది. ఇప్పుడు కిలో వెండి ధర 78,000 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ధరల్లో కొంత మార్పులు ఉండే అవకాశముంది.