Gold Prices : మళ్లీ షాకిచ్చిన పసిడి ధరలు.. ఇక పరుగు ఆపదేమో?
ఈరోజు దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి
బంగారం ధరలు పరుగును ఆపడం లేదు. ఒక్కసారి మొదలు పెట్టిందంటే ఇక దాని ధర పెరగడం ఆపడం ఎవరి తరం కాదు. నిన్నటి నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత ధరలు పెరుగుతాయని ఊహించిందే. అయితే ఇంత ఫాస్ట్ గా పెరుగుతాయని మాత్రం ఎవరూ అంచనా వేయలేదు. బడ్జెట్ లో బంగారం దిరుమతులను మరింత తగ్గించడం కానీ, కస్టమ్స్ డ్యూటీ పెంచడం వంటివి చేయకపోయినా పసిడి మాత్రం పరుగులు తీస్తూనే ఉంది.
డిమాండ్ తగ్గని...
బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కొనుగోళ్లు సాధారణంగా తగ్గవు. భారతీయ సంస్కృతిలో అది భాగంగా మారిపోవడం, స్టేటస్ సింబల్ కావడంతో ప్రతి ఒక్కరూ బంగారాన్ని తమ ఇంటి వస్తువుగా భావిస్తారు. అది ఉంటే అన్ని రకాలుగా ఉపయోగకరం ఉంటుందని భావించి కొనుగోలు చేస్తుంటారు. ఇక పెళ్లిళ్ల సీజన్ లో చెప్పాల్సిన పనిలేదు. జ్యుయలరీ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడిపోతుంటాయి. అందుకే బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి.
ధరలు నేడు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై నూట యాభై రూపాయలు పెరిగింది. వెండి కిలో ధర రెండు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,300 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,600 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 78,000 రూపాయలుగా ఉంది.