Gold Prices Today : బంగారం మరీ ఇంతగా షాకిచ్చిందా... మరింత భారం కానుందా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి
బంగారం ధరలు ప్రియమవుతాయని అందరికీ తెలుసు. ఎందుకంటే పుత్తడికి ఉన్న డిమాండ్ మరెే వస్తువుకీ ఉండదన్న విషయం కూడా అంతే నిజం. బంగారం, వెండి అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు బంగారంతో బంధాన్ని విపరీతంగా పెంచుకుంటారు. ఎంత అంటే ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా బంగారం ఉండాల్సిందే. అది పుట్టిన రోజైనా.. పెళ్లి రోజైనా..మరేదైనా శుభకార్యక్రమమైనా సరే.. బంగారాన్ని కొనుగోలు చేయడం అనేది అలవాటుగా మార్చుకున్నారు. అందుకే బంగారం, వెండికి అంత డిమాండ్ పెరిగింది.
కొనుగోలు శక్తి పెరగడంతో...
బంగారం, వెండి ధరలకు డిమాండ్ పెరగడం ఈరోజు నుంచి మొదలు కాలేదు. ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగడంతో బంగారాన్ని కొనుగోలు చేయడం కూడా పెరిగింది. ధరలు పెరుగుతున్నప్పటికీ బంగారాన్ని కొనుగోలు చేయడాన్ని మాత్రం మార్చుకోలేదు. కొందరు స్టేటస్ సింబల్ గా బంగారం, వెండిలను చూస్తే మరికొందరు పెట్టుబడి రూపంలో మదుపు చేయడానికి బంగారాన్ని కొనుగోలు చేయడంతో డిమాండ్ మరింత పెరిగింది. భారత దేశంలో బంగారం నిల్వలు కూడా భారీగా పెరిగాయంటే అందుకు కారణం ఎక్కువ కొనుగోళ్లు జరగడమే.
మరింత పెరిగి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,610 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,760 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 100060 రూపాయలకు చేరుకుంది.