Gold Prices Today : బంగారాన్ని ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదా? కాదా?
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా పెరిగాయి. వెండి ధర కూడా పెరిగింది
బంగారం ధరలు ఒకరోజు తగ్గుతూ, మరొకరోజూ పెరుగుతున్నాయి. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు డైలమాలో పడుతున్నారు. ధరలు రానున్న కాలంలో తగ్గుతాయని కొందరు.. మరింతగా పెరుగుతాయని మరికొందరు తమ విశ్లేషణలు అందచేస్తున్నారు. దీంతో కొనుగోలు చేయాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్నారు. రానున్న రోజుల్లో మూఢమి కావడంతో కొనుగోళ్లు తగ్గుతాయని అప్పుడు బంగారం ధరలు దిగివస్తాయని మార్కెట్ నిపుణులు కొందరు చెబుతున్నారు.
ధర తగ్గుతాయని భావిస్తే...
అదే సమయంలో బంగారం ధర తగ్గడమంటూ జరగదని, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో ధరలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు మరికొందరు. సీజన్ తో సంబంధం లేకుండా ధరలు పెరగడాన్ని గతంలో చూశామని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఆలోచించకుండా వెంటనే కొనుగోలు చేయడం మంచిదని సూచనలు కూడా వెలువడుతున్నాయి.
స్వల్పంగా పెరిగి...
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా పెరిగాయి. వెండి ధర కూడా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర పై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర పై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,810 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,340 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 80,400 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.