Gold Prices Today : మళ్లీ పెరుగుతోందిగా.. ఇక కళ్లెం పడదేమో?
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా పెరిగాయి. వెండి కూడా స్వల్పంగా పెరిగింది
Gold Prices Today :బంగారం ధరలు నాలుగు రోజుల నుంచి స్వల్పంగా తగ్గాయి. రోజుకు పది రూపాయలు పది గ్రాములపై తగ్గుతూ వస్తున్నాయి. ఇది పెద్ద తగ్గుదల కాదన్న సంగతి తెలిసినా కొనుగోలు దారుల్లో కొంత ఊరట కలిగింది. పెళ్లిళ్ల సీజన్ లో ధరలు పెరగకుండా తగ్గుతున్నాయంటే చాలు అనుకుని తృప్తి పడ్డారు. బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. ప్రతి రోజూ ధరల్లో మార్పు చోటు చేసుకుంటుంది. విదేశీ మాంద్యం, అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకుల వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.
ధరలు తగ్గుతాయని...
అది కామన్ అయినప్పటికీ ఎక్కువగా ధరలు తగ్గుతాయని అందరూ ప్రతి రోజూ భావిస్తారు. మరి కొద్దిరోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ముగియనుండటంతో కొనుగోళ్లు కూడా తగ్గే అవకాశాలున్నాయి. అందుకే కొంత కాలం క్రితం భారీగా పెరిగిన బంగారం ధరలు నాలుగు రోజుల నుంచి స్వల్పంగానే తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదల కొనుగోళ్ల పై పెద్దగా ప్రభావం చూపదని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం చెబుతుంది. ఎందుకంటే సంస్కృతి, సంప్రదాయాల మేరకు బంగారం, వెండి ప్రతి ఇంట్లో ఒక వస్తువుగా మారడమే ఇందుకు కారణం.
స్వల్పంగా పెరిగినా...
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా పెరిగాయి. వెండి కూడా స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు, కిలో వెండి ధరపై వంద రూపాయల వరకూ పెరిగింది. ఇది పెద్దగా పెరుగుదల కాకపోయినా.. మున్ముందు ధరలు పెరగడానికి సంకేతాలుగా చూడాలంటున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 60,610 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,120 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 80,100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.