Gold Prices Today : పరుగు మొదలు పెట్టిందిగా.. ఇక ఆగుతుందో లేదో?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగానే పెరిగింది. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.
గత నాలుగు రోజుల నుంచి తగ్గిన పసిడి ధరలు పరుగును ప్రారంభించాయి. అయితే ఈ పరుగు ఎంత వరకూ వెళుతుందో తెలియదు కానీ నేడు మాత్రం స్వల్పంగానే బంగారం ధరలు పెరిగాయి. గత నాలుగు రోజుల నుంచి పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే రోజుకూ తగ్గుతూ వస్తుంది. అది పెద్ద తగ్గుదల అని చెప్పలేం. కానీ ఎంతో కొంత తగ్గుదల మంచికేగా అన్నట్లు కొనుగోలుదారులు కూడా జ్యుయలరీ దుకాణాల వైపు అడుగులు వేశారు.
ఎంత పెరిగినా...?
కానీ బంగారం ఒకసారి పరుగు మొదలు పెట్టిందంటే ఆగేది ఉండదు. ఈరోజు స్వల్పంగా పెరిగినా రానురాను ధరలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు పెరుగుతాయని ముందుగానే అంచనాలు వినపడుతున్నాయి. అయితే అవి ఎంత వరకూ పెరుగుతాయన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి. పసిడి అంటేనే మక్కువ ఉన్న ఈరోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు ఆగవన్నది అందిరికీ తెలిసిందే. అందుకే ధరల విషయంలో జనం కూడా పట్టించుకోవడం మానేశారు.
స్వల్పంగానే పెరిగినా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగానే పెరిగింది. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,110 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,300 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర వంద రూపాయలు తగ్గి 77,100 రూపాయలకు చేరుకుంది.