Gold Prices Today : పరుగు ఆపి.. నిలకడగా.. నేడు బంగారం కొనుగోలు చేయొచ్చు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.
బంగారం ధరలు వరసగా పెరుగుతూ వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న స్వల్పంగా ధరలు తగ్గినా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారానికి ఉన్న డిమాండ్ ఏ వస్తువుకూ లేదు. ఎప్పటికీ తరగని గిరాకీ ఒక్క బంగారానికే ఉంటుంది. అందుకే ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. పెట్టుబడిగా చూసే వారు కూడా బంగారం కొని మదుపు చేసుకోవాలనుకుంటారు. అందుకే బంగారం ధరలు పైపైకి వెళుతుంటాయి.
పెట్టుబడిగా...
భూమి తరహాలోనే బంగారాన్ని తమకు అవసరమైనప్పుడు విక్రయించడమూ సులువు. బ్యాంకుల్లో భద్రపర్చుకునే వీలు కూడా ఉండటంతో ఇటీవల బంగారం, భూమి కొనుగోళ్లపైనే ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారు. భూములయితే ఆక్రమణలకు గురవుతాయి కానీ బంగారం విషయంలో అలా ఉండకపోవడంతో దానిపైనే ఎక్కువ మంది పెట్టుబడి పెడుతున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు బంగారం ధరలు మరింత పెరుగుతాయి. దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అలవాటుగా మారింది.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. అయితే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు మార్కెట్ నిపుణుల నుంచి వెలువడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58.100 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,380 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 77,000 రూపాయలుగా కొనసాగుతుంది.