Gold Prices Today : గోల్డ్ కొనేయాలనుకునే వారికి నేడు గుడ్ డే.. ఎందుకంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి

Update: 2024-03-24 03:26 GMT

బంగారం కొనుగోలు చేసే వారికి ఒకరకంగా శుభవార్తే. బంగారం ధరలు పెరగలేదు అంటే అది గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. తగ్గినా కూడా బంగారం ధరలు ఆశించిన స్థాయిలో తగ్గవు. పెరిగితే మాత్రం మోత మోగుతుంది. అందుకే పసిడి ప్రియులు ఎప్పుడూ బంగారం ధరల తగ్గాయన్న వార్త కంటే పెరిగాయన్న వార్తపైనే ఎక్కువ దృష్టి పెడతారు. బంగారానికి దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ అలాంటిది.

ఆభరణాలకే...
ివిదేశాల్లో అయితే గోల్డ్ బాండ్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కానీ మనదేశంలో ఎక్కువగా బంగారు ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి పసిడిని సొంతం చేసుకోవాలంటే ఆర్నమెంట్ ను కొనుగోలు చేయడమే మంచిదని భావిస్తారు. అందుకే దక్షిణ భారత దేశంలో జ్యుయలరీ దుకాణాలు వీధికి నాలుగైదు కనిపిస్తాయి. ఎన్ని దుకాణాలున్నా కొత్త కొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ అమ్మకాలను పెంచుకుంటున్నాయి.
నేడు స్థిరంగా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి. స్థిరంగా ధరలు ఉండటం చాలా రోజుల తర్వాత మార్కెట్ లో కనిపిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,250 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,280 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 80,500 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News