Gold Prices Today : మహిళలు మక్కువ చూపితే అంతే మరి.. ధరలు దిగుతాయా?

ఈరోజు బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. చాలా రోజుల తర్వాత ధరలు నిలకడగా ఉన్నాయి

Update: 2024-03-31 03:21 GMT

బంగారం ధరలు తగ్గాయంటే సంతోషించాలి. పెరిగాయంటే బాధపడాలి. అదే స్థిరంగా కొనసాగుతున్నాయంటే.. ఏమనుకోవాలి? బంగారం ధరల్లో ప్రతి రోజూ మార్పు ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో కొనసాగుతున్న మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరల్లో ప్రతి రోజూ మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని సార్లు తగ్గితే.. ఎక్కువ సార్లు పెరుగుతూ ఉంటాయి. అదే బంగారానికి ఉన్న స్పెషాలిటీ.

డిమాండ్ ఎక్కువ...
బంగారం అంటే అంతే మరి. దానికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు లేదు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అత్యంత ఇష్టపడే వస్తువుకు సహజంగానే డిమాండ్ ఉంటుంది. అందుకే కొనుగోలు చేయడానికి ఎవరూ వెనుకంజ వేయరు. బంగారం ధరలు పెరిగినా పెద్దగా పట్టించుకోకుండా కొనుగోలు చేస్తుండటం వల్లనే దాని ధర అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. రానున్న కాలంలో పది గ్రాముల బంగారం ధర డెబ్బయివేల రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు.
నేడు స్థిరంగానే...
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. చాలా రోజుల తర్వాత ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,750 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,450 రూపాయలుగా నమోదయింది. ఇక వెండి ధర కూడా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 81,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.




Tags:    

Similar News