Gold Prices : రెండు రోజులే సమయం.. వెయిట్ చేస్తే లాస్ తప్పదట... ఇక మీ ఇష్టం
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా మార్పు కనిపించలేదు
బంగారం ధరలు నేడు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో పసిడిప్రియులు ఊరట చెందుతున్నారు. పసిడి పెరుగుతుందన్న కారణంతో ముందుగా కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి తరుణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా బంగారం ధరల్లో పెద్దగా మార్పులేదు. భారీగా కూడా ధరలు పెరగడం లేదు. అలాగే భారీగా తగ్గింది కూడా లేదు. అయినా సరే రానున్న రోజుల్లో పసిడి ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
బడ్జెట్ సమావేశాలు...
బడ్జెట్ సమావేశాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే నిర్ణయాలను బట్టి బంగారం ధరల్లో మార్పులపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో పసిడి ధరలు పెరుగుతాయా? లేదా? అన్నది తెలిసిపోతుందని మార్కెట్ నిపుణులు సయితం చెబుతున్నారు. కస్టమ్స్ డ్యూటీ పెంచడం, దిగుమతులు తగ్గిస్తే మాత్రం బంగారం ధరలకు మరింత రెక్కలు వస్తాయని అంటున్నారు. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి.
నేటి ధరలు ఇలా...
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా మార్పు కనిపించలేదు. దీంతో బడ్జెట్ కు ముందే బంగారం, వెండి కొనుగోలు చేయడం మంచిదంటున్నారు నిపుణులు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,700 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,950 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర మాత్రం 77,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.