Gold Prices : పండగపూట బంగారం కొనాలనుకునే వారు ఈ వార్త వింటే చాలు

ఈరోజు మాత్రం దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి

Update: 2024-01-15 04:20 GMT

బంగారం ధరలు పెరగడం మామూలే. పసిడి ప్రియులు ఎప్పుడూ ధరలు తగ్గడం కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ధరలు తగ్గేది తక్కువ సార్లు. పెరిగేది ఎక్కువ సార్లు. ధరలు తగ్గినా స్వల్పంగానే.. పెరిగితే భారీగా పెరుగుతాయి. అందుకే బంగారం ధరలు తగ్గాయని సంతోషించడానికి వీలులేదు. అలాగే పెరిగిందని బాధపడటానికి లేదు. ఎందుకంటే ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని నిత్యం మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. ధరల పెరుగుదలకు అనేక కారణాలున్నాయి.

రీజన్ లేకున్నా...
పండగలు, పెళ్లిళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. రీజన్ లేకుండా గోల్డ్ ను కొనుగోలు చేయడం ఒక సంప్రదాయంగా వస్తుంది. సీజన్ కూడా లేదు. ఎప్పుడైనా డబ్బులుంటే కొనుగోలు చేస్తుంటారు. అలాంటిది కొన్ని రోజుల నుంచి ధరలు స్థిరంగా ఉండటం, తగ్గడం జరుగుతుంటాయి. పండగ పూట కూడా ధరలు పెరిగితే ఎవరు కొంటారు? అందుకే కొనుగోళ్లు కూడా ఇటీవల కాలంలో మందగించాయని చెబుతుంటారు. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పోటీ పడుతుండటం మామూలే.
ధరలు ఇలా...
ఈరోజు మాత్రం దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,000 రూపాయలుగా కొనసాగతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,270 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర మాత్రం నిలకడగానే కొనసాగుతుంది. కిలో వెండి ధర 76,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.



Tags:    

Similar News