Gold Prices : అమాంతం అలా పెరిగితే ఎలా? కొనుగోలు చేయాలా? వద్దా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది
పసిడికి పడిపోని వారు ఎవ్వరూ ఉండరు. అందులో ముఖ్యంగా మహిళలు పసిడి అంటేనే చాలు అది ఉంటే చాలు అని అనుకుంటారు. దీనికి ఒక లిమిట్ లేదు. ఎంత పసిడి ఉన్నా ఇంకా తమ సొంతం చేసుకోవాలన్నదే వారి కోరిక. పసిడిపై వ్యామోహం ఎప్పటికీ పోదు. ఎంత కొన్నా డబ్బులు సమకూరే కొద్దీ ఇంకా దానినే కొనుగోలు చేయాలని అనుకుంటారు. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ ను జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం సొమ్ము చేసుకుంటుంది.
ఆకట్టుకుంటూ...
కొత్త కొత్త డిజైన్లతో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ మహిళలను ఆకట్టుకుంటే చాలు తమ దుకాణాలు కళకళలాడిపోతాయని నమ్ముతారు. దీంతో పాటు తరుగులో కొంత శాతం అంటూ ఊరిస్తారు. ఈఐఎంల ద్వారా కొనుగోలు చేసే సదుపాయాన్ని కూడా కల్పించడంతో ఇక కొనుగోలు చేయడానికి ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. చిన్న వస్తువునైనా ప్రతి ఏటా కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని నెల నెల ఈఐఎంలు కట్టి మరీ బంగారాన్ని చాలా మంది సొంతం చేసుకుంటున్న పరిస్థితి.
భారీగా పెరిగిన...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 820 రూపాయలు పెరగింది. వెండి కూడా తాను కూడా తగ్గేదే లేదని నిరూపించింది. కిలో వెండి ధర పై 700 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,380 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర భారీగా పెరిగి 82,200 రూపాయలుగా నమోదయింది.