Gold Prices Today : పడతులకు పసిడి ఇక అందుబాటులో ఉండదా? ఇక కొనటం కష్టమేనా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా ఎక్కువ మొత్తంలోనే పెరుగుదల కనిపించింది.

Update: 2024-08-02 03:42 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు నిజమయ్యేటట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం మళ్లీ 70 వేల రూపాయలకు చేరుకుంది. వెండి కిలో ధర లక్ష రూపాయలకు చేరువలో ఉంది. అంటే ఇక రానున్న రోజుల్లో మరింతగా ధరలు పెరుగుతాయని సిగ్నల్స్ వచ్చేసినట్లే. కొద్ది రోజుల క్రితం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడంతో పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా తగ్గుతుందేమోనని భావించారు. ఆశించారు. కానీ వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. మళ్లీ బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఎంతగా అంటే స్పీడ్ గా పరుగును ప్రారంభించాయి.

చివరిలోనే....
ఆషాఢం మాసం చివరిలోనే ఇలా షాకిస్తున్న బంగారం, వెండి ధరలు శ్రావణ మాసం ప్రారంభమయితే ఇంకెంత పెరుగుతాయన్నది మాత్రం అర్థం కాకుండా ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కస్టమ్స్ సుంకం పై ఆరు శాతం తగ్గించినప్పటికీ ధరలు కొంత తగ్గి తిరిగి పెరగడం ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, దిగుమతులు తగ్గడం వంటి కారణాలు బంగారం ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
భారీగా పెరిగి....
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా ఎక్కువ మొత్తంలోనే పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 1,170 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై ఆరు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,510 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,370 రూపాయలుగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం ఆరు గంటల వరకే ఈ ధరలున్నాయి. మధ్యాహ్నానికి మరింత పెరిగే అవకాశముంది. కిలో వెండి ధర ప్రస్తుతం 91,800 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News