Gold Price Today : వామ్మో.. ఇలా ధరలు పెరిగితే ఏం చేయాలి? ఇక కొనుగోలు చేయగలమా బాసూ?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది

Update: 2024-08-03 03:22 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ఒక్కసారిగా పరుగు అందుకున్నాయి. బంగారం, వెండి ధరలు పెరుగుతాయని ముందు నుంచే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మార్కెట్ నిపుణులు ఎప్పటికప్పడు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటి బంగారంపై ఆరు శాతం తగ్గినప్పుడు ధరలు భారీగా పతనమయ్యాయి. అప్పుడే కొనుగోలు చేయాలని అనేక మంది చెప్పారు. కానీ ఇంకా తగ్గుతాయని చాలా మంది వెయిట్ చేశారు. అలాంటి వారికి మాత్రం ఆశాభంగం కలిగింది. ధరలు మామూలుగా పెరగడం లేదు. ప్రతి రోజూ ధరలు పెరుగుతూనే వెళుతున్నాయి.

శ్రావణానికి ముందే...
ఆషాఢమాసం ముగియనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ధరలు పెరగడం ప్రారంభించాయి. బంగారం ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారింది. చిన్న ఫంక్షన్ కు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడం మొదలుపెట్టడంతో వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రజలకు కొనుగోలు శక్తి పెరగడంతో ఎక్కువ మంది బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. బంగారంపై పెట్టుబడులు పెడితే నష్టం రాదని భావించి ఎక్కువ మంది కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్ పెరిగడంతోనే ధరలు నింగినంటుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా జరుగుతున్న అనేక రకమైన పరిణామలు ధరల పెరుగుదలకు దోహద పడుతున్నాయి.
ధరలు పెరిగి....
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధరపై 150 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ధరలు ఇంకా పెరిగే అవకాశముందని శ్రావణమాసానికి బంగారాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్న వాళ్లు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,810 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,700 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 90,900 రూపాయలుగా ఉంది.



Tags:    

Similar News