Gold Prices Today : డెబ్బయివేలకు చేరుకున్న బంగారం.. ఊహించినట్లుగానే జరుగుుతుందిగా
నేడు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి.
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన వార్నింగ్ బెల్స్ మోగాయి. మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని ఎప్పటి నుంచో అంచనాలు వినిపిస్తున్నాయి. పసిడి ధరలు డెబ్భయి వేల రూపాయలకు చేరుకున్నాయి. బంగారం ధరలు ఎప్పుడూ అంతే. పెరిగితే ఎక్కువగా ధరలు పెరుగుతాయి. తగ్గితే స్వల్పంగానే తగ్గుతాయి. అందరికీ తెలిసినా చాలా రోజుల తర్వాత బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా ముగిసే సమయంలో ఈ ధరలు పెరగడం విశేషం.
సీజన్ ముగిసే సమయంలో...
పెళ్లిళ్ల సీజన్ ఈ నెల 28వ తేదీ ముగియనుంది. తర్వాత మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు లేవు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారానికి డిమాండ్ పెరగడం, దేశీయంగా దిగుమతులు తగ్గడంతో ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రికార్డు స్థాయికి బంగారం ధరలు పెరగడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి క్షీణించడం వంటి కారణాలు కూడా బంగారం ధరలు పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు.
నేటి ధరలు...
నేడు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,610 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,480 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 82,100 రూపాయలుగా కొనసాగుతుంది.