Gold Rates Today : ఏందో ధరలు తగ్గినట్లుగా... తీరా చూస్తే ఇది తగ్గుదలా? రెండు రోజుల నుంచి అంతే
నేడు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం పై పది రూపాయలు తగ్గగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది
Gold Rates Today :పసిడి ధరలు గత రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలతో పెళ్లిళ్ల సీజన్ లో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొనుగోలు చేయాల్సిన సమయంలో ధరలు పెరిగిపోవడం జనాలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసింది. పెళ్లిళ్లకు తప్పనిసరిగా బంగారాన్ని కొనుగోలు చేయాల్సి రావడం, సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా గోల్డ్ ను కొనుగోలు చేయాల్సి రావడంతో విధిలేక, తప్పనిపరిస్థితుల్లో కొనుగోళ్లు చేయాల్సి వచ్చిందని లబోదిబో మన్నారు.
రెండు రోజుల నుంచి...
అయితే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధర త్వరలోనే ఎనభై వేలకు చేరుకుంటుందన్న మార్కెట్ నిపుణుల అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు పరుగులు పెడతాయని భావించారు. గత మంగళవారం ఏకంగా పది గ్రాముల బంగారం ధరపై ఎనిమిది వందల రూపాయలు పెరిగింది. అయితే రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతుండటం కొంత ఊరట కల్గించే అంశంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో ఒడిదుడుకుల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.
స్వల్పంగానే...
నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గగా, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గి ఏదో తగ్గినట్లు బిల్డప్ ఇచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,740 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,260 రూపాయలుగా ట్రెండ్ అవుతుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కిలో వెండి ధర ప్రస్తుతం 78,900 రూపాయలుగా కొనసాగుతుంది.