Gold Prices Today : మగువలకు మంచి వార్త.. బంగారాన్ని నేడు కొనుగోలు చేసే వారికి?
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
పసిడి ధరలు ఒకరోజు పెరుగుతాయి. మరొక రోజు తగ్గుతాయి. ఇది కామన్. అంతర్జాతీయంగా ధరల ఒడిదుడుకులు, విదేశీ మాంద్యం, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు ప్రతి రోజూ మారుతుంటాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్వల్పంగానే తగ్గుతూ వస్తున్నాయి. అలాగే స్వల్పంగా పెరుగుతున్నాయి. బంగారానికి డిమాండ్ ఏ మాత్రం తగ్గకపోయినా ధరల్లో పెద్దగా మార్పు లేకపోవడం కొంత ఊరట కల్గించే అంశంగానే చెప్పుకోవాలి.
మూఢమి వస్తుండటంతో...
పెళ్లిళ్ల సీజన్ కూడా త్వరలో ముగియనుంది. వచ్చే నెలతో పెళ్లిళ్ల సీజన్ ముగిసి మూఢమి ప్రారంభం కానుంది. అంటే కొనుగోళ్లు తగ్గుతాయని, తద్వారా బంగారం ధరలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. కానీ అలాంటిదేమీ ఉండదన్నది నిపుణుల మాట. బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని, దానిని కొనుగోలు చేయడానికి ఒక సమయం అంటూ ఉండదని చెబుతున్నారు. ఈ ఏడాది బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు.
కొద్దిగా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,970 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,320 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 79,900 రూపాయలుగా ఉంది.