Gold Prices Today : దిగి వస్తున్నాయని సంబరపడకండి.. ముందు ముందు ధరలు పెరిగే అవకాశం

ఈరోజు బంగరాం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి

Update: 2024-02-13 02:59 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని భావిస్తున్న తరుణంలో ధరలు తగ్గుతుండటం కొంత ఊరట కల్గిస్తున్నదే. పెళ్లిళ్ల సీజన్ లో ధరలు తగ్గడం చాలా మందికి ఎంతో రిలీఫ్ కలిగించేదే. పెళ్లిళ్ల సీజన్ లో ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అది మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో వస్తున్న ఆచారం కావడంతో బంగారం లేనిదే పెళ్లిళ్లు జరగవు. అందుకే ఈ సీజన్ లో బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న అంచనాలు బాగా వినిపించాయి.

కొద్ది రోజలుగా...
అయితే గత కొద్దిరోజులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. పెద్దగా ధరలు తగ్గకపోయినా కొంత తగ్గుతుండటం మాత్రం బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త అని చెప్పాలి. దీంతో అమ్మకాలు కూడా భారీగా పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు సహజమేనని చెబుతున్నా రానున్న కాలంలో మాత్రం ధరలు పెరిగే అవకాశముందంటున్నారు.
వెండి మాత్రం...
ఈరోజు బంగరాం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే తగ్గింది. కిలో వెండి ధరపై మాత్రం వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,940 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం 77,100 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News