Gold Prices Today : నేడు బంగారం, వెండి ధరలు తగ్గాయి.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు పసిడి ధరలు కొంత తగ్గాయి. వెండి ధరలు కూడా దేశంలో తగ్గుముఖం పట్టాయి.
పసిడి ధరలు పెరుగుతూనే ఉంటాయి. అవి ఒకసారి పెరిగాయంటే అంతే స్థాయిలో తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ అలాంటిది. ఇప్పటికే బంగారం, వెండి ధరలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. కొన్ని వర్గాలకే బంగారం సొంతం అన్న భావన ఏర్పడింది. అయినా సరే కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.
డిమాండ్ తగ్గక పోవడంతో...
అదే సమయంలో ప్రస్తుతం ముహూర్తాలు లేకపోవడంతో ధరలు దిగి వస్తాయని వేసిన అంచనాలు కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. మూడు నెలలు ముహూర్తాలు లేకపోయినా సరే కొనుగోళ్లు మాత్రం తగ్గక పోవడంతో ధరలు దిగి రావడం లేదు. ఇలాగే పెరిగితే తులం బంగారం ధర ఎనభై వేల రూపాయలకు చేరువయ్యే రోజు ఎంతో దూరం లేదు. అలాగే వెండి కిలో ధర కూడా లక్షకు దగ్గరగా ఉంది. ఇలా ధరలు పెరుగుతుండటం కొంత ఆందోళన కలిగిస్తున్నా పసిడిపై ఉన్న ప్రేమతో వాటిని కొనుగోలు చేయకుండా ఆగలేకపోతున్నారు.
స్వల్పంగా తగ్గినా...
ఈరోజు పసిడి ధరలు కొంత తగ్గాయి. వెండి ధరలు కూడా దేశంలో తగ్గుముఖం పట్టాయి. అయితే రెండు వస్తువుల ధరలు స్వల్పంగానే తగ్గాయి. కానీ మళ్లీ ధరలు పెరిగే అవకాశముందని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,390 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,610 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 96,400 రూపాయలుగా కొనసాగుతుంది.