Gold Price Today : వావ్.. దిగివస్తున్న ధరలు.. ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ అంటున్నారే

మూఢమి ప్రారంభంలో మహిళలకు మంచి న్యూస్ అందుతుంది. బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం

Update: 2024-05-02 02:37 GMT

మూఢమి ప్రారంభంలో మహిళలకు మంచి న్యూస్ అందుతుంది. బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. నిన్న ఒక్కరోజులోనే పదిగ్రాముల బంగారం ధరపై దాదాపు వెయ్యి రూపాయలు తగ్గింది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో బంగారం తగ్గడం ఇదే తొలిసారి. దీంతో బంగారం ధరలు తగ్గుతాయనుకుంటే పొరపాటు పడినట్లేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మూఢమి మొదలుతో...
మూఢమి ప్రారంభం కావడంతో ముహూర్తాలు లేకపోవడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. అయితే ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రానున్న కాలంలో అక్షర తృతీయ ఉంటుంది. అక్షర తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదిగా అనేక మంది భావిస్తారు. అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే తగ్గినప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
నేటి ధరలు...
ఈరోజు కూడా దేశంలో బంగాంర ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా దిగి వచ్చాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,540 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,500 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 85,400 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News