పాపం పసివాడు.. రెండు పాములు కలిసి
వర్షం పడిన సమయంలో పాముల బెడద కూడా ఉంటుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వర్షాలకు
వర్షం పడిన సమయంలో పాముల బెడద కూడా ఉంటుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఎంతో మంది పాముల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ మరికొందరు నిరసన తెలిపారు. అయితే ఓ పిల్లాడిని రెండు పాములు కాటేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామానికి చెందిన భూమేశ్, హర్షిత దంపతుల కొడుకు రుద్రాన్ (2) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంటిపైకప్పు నుంచి పడిన రెండు పాములు బాబును కాటేశాయి. బాబు ఏడవడంతో గమనించిన తల్లి వెంటనే పాములను పట్టుకొని బయటికి విసిరేసింది. బాలుడిని జిల్లా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. బాలుడు గట్టిగా ఏడవడంతో అక్కడి నుంచి వెళ్తున్న పాములను తండ్రి భూమయ్య గమనించాడు. వెంటనే వాటిని కర్రతో కొట్టి చంపాడు. అనంతరం బాలుడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాదం నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంట్లో ఉన్న ఓ గది కూలిపోయింది. దీంతో పక్కనున్న మరో గదిలో నిద్రిస్తూ ఉండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.