శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత

ముఖ్యంగా యువత మత్తుకు బానిసవుతోంది. ఇటీవలే గుజరాత్ లో వందలకోట్ల విలువైన మత్తుపదార్థాలు పట్టుబడిన విషయం తెలిసిందే.

Update: 2022-04-25 13:22 GMT

శంషాబాద్ : తెలుగు రాష్ట్రాలు మత్తులో మునిగి తేలుతున్నాయి. గంజాయి, డ్రగ్స్, హెరాయిన్ ఇలా రకరకాల మత్తు పదార్థాల మాఫియా ఎక్కువైంది. ముఖ్యంగా యువత మత్తుకు బానిసవుతోంది. ఇటీవలే గుజరాత్ లో వందలకోట్ల విలువైన మత్తుపదార్థాలు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. ఖతార్ నుంచి సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ చేరుకున్న విమానంలో నౌరోబీ నుంచి దోహా మీదుగా శంషాబాద్ వ‌చ్చిన ఓ ప్ర‌యాణికురాలిని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఆమె వద్ద నుంచి 3.12 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. సీజ్ చేసిన హెరాయిన్ విలువ రూ.21.9 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.



Tags:    

Similar News