కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు;

Update: 2022-11-05 14:20 GMT

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. 11 మందికి గాయాలయ్యాయి. గాయాలపాలయిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరణించిన వారంతా కూలీలేనని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి ఆటోలో తిరిగి వెళుతుండగా ట్రక్కు వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

మృతులంతా...
బీదర్ జిల్లాలోని చిట్టగుప్ప సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు పార్వతి, పద్మావతి, గుండమ్మ, యాదమ్మ, జగ్గమ్మ, ఈశ్వరమ్మ, రుక్మిణిలుగా గుర్తించారు. సమాచారం తెలిసిన పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయలపాలైన వారిలో రెండు వాహనాల డ్రైవర్లు కూడా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News