Road Accident : అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

అనంతపురం జిల్లా బాచుపల్లి రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు;

Update: 2024-05-18 02:40 GMT
road accident, three died, van, anantapur district, lorry, crime news

road accident in anantapur 

  • whatsapp icon

అనంతపురం జిల్లా బాచుపల్లి రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అతి వేగమే...
మృతులందరూ అనంతపురం నగరంలోని రాణిపేట వాసులుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. డ్రైవర్ నిద్రమత్తులో అతి వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News