Car Accident : కారులో ఇద్దరు సజీవ దహనం.. ఘట్ కేసర్ లో ఘటన

ఘట్ కేసర్ లో ప్రమాదం జరిగింది. కారులో ఇద్దరు సజీవ దహనం అయ్యారు;

Update: 2025-01-06 13:38 GMT

ఘట్ కేసర్ లో ప్రమాదం జరిగింది. కారులో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. రన్నింగ్ కారులో మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఇద్దరు మరణించారు. కారు వరంగల్ నుంచి హైదరాబాద్ కు వస్తుంది. ఘట్ కేసర్ ప్రాంతానికి రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారులోనే ఇద్దరూ చిక్కుకపోయారు. మృతులు ఇద్దరూ ఉప్పల్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

రన్నింగ్ కారులో...
ఘట్ కేసర్ ఓఆర్ ఆర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఆ రహదారిపై ట్రాఫిక్ కొద్దిసేప స్థంభించిపోయింది. పోలీసులు అక్కడకు చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కారులో ప్రమాదం ఎందుకు జరిగింది అన్నది తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ



 


Tags:    

Similar News