Tirupathi : తిరుపతిలో దారుణం.. భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరి మృతి
తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు.;
తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. చంద్రగిరి మండలం నరశింగాపురం నారాయణ కళాశాల వద్ద ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
తిరుమలకు పాదయాత్రగా వస్తున్న భక్తులపై...
మృతి చెందిన వ్యక్తులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ్మ, శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మగా పోలీసులు గుర్తించారు. మదనపల్లి నుంచి తిరుపతి రూయా ఆసుపత్రికి రోగిని తీసుకొస్తున్న 108 వాహనం పాదయాత్ర గా తిరుమలకు వెళుతున్నభక్తులపైకి దూసుకెళ్లింది. వీరంతా పుంగనూరు నుంచి తిరుమల కు పాదయాత్రగా వస్తున్నారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now