ఇంటి స్థలం కోసం ఘర్షణ.. ముగ్గురి మృతి

సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఇంటి స్థలం విషయం లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ముగ్గురు మరణించారు

Update: 2024-12-16 02:14 GMT

సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఇంటి స్థలం విషయం లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకవర్గంపై మరొక వర్గం కత్తులతో దాడికి దిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కారదాల ప్రకాశరావు,చంద్రరావు, కారదాల యేసుగా గుర్తించినట్లు పోలీసులు తెలిారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ముగ్గురికి గాయాలు...
దీంతో గాయపడిన వారిని ముగ్గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. స్థల వివాదమే ఘర్షణలకు కారణమని పోలీసులు చెబుతున్నారు. గ్రామంలో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News