ప్రియురాలిపై లైంగిక దాడి.. ఆపై స్నేహితులకు అప్పగించిన ప్రియుడు
ఇంట్లో ఎవ్వరూ లేరు. విషయం గ్రహించిన ఆమె అక్కడినుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఆమెపై ప్రియుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
సెలవు రోజు కావడంతో ప్రియురాలిని ఇంటికి ఆహ్వానించాడు ప్రియుడు. సరే ప్రేమించిన వ్యక్తి కదా అని నమ్మి వెళ్లింది. తీరా చూస్తే ఇంట్లో ఎవ్వరూ లేరు. విషయం గ్రహించిన ఆమె అక్కడినుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఆమెపై ప్రియుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను తన స్నేహితులకు అప్పగించాడు. ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కు చెందిన ఓ యువతి నామక్కల్ వెప్పేడులోని ఓ ప్రైవేట్ మిల్లులో పనిచేస్తోంది. అదే మిల్లులో పనిచేసే బాలరాజ్ తో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ఆదివారం సెలవురోజు కావడంతో బాలరాజ్ తన ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన ఆమె .. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దాంతో ఆమెపై బాలరాజ్ బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను తన స్నేహితులకు అప్పగించాడు. బాలరాజ్ స్నేహితులైన ప్రదీప్, మనోజ్ లు కూడా ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేయడంతో.. యువతి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో భయపడిన బాలరాజ్, అతని స్నేహితులు బీహార్ పారిపోయారు. అర్థరాత్రి సమయంలో స్పృహలోకి వచ్చిన ఆమె కేకలు పెట్టడంతో.. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బాలరాజ్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. యువతి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. బీహార్ పారిపోవడానికి సిద్దమవుతున్న బాలరాజ్, అతని స్నేహితులను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.