బంగారాన్ని పేస్టుగా మార్చి.. పొట్టలో దాచి?
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రతి రోజూ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రతి రోజూ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా మరోసారి ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వస్తున్న ఒక ప్రయాణికుడి వద్ద నుంచి 960 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ యాభై లక్షల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తనిఖీల్లో....
షార్జా నుంచి వస్తున్న ఈ ప్రయాణికులు బంగారాన్ని పేస్టుగా మార్చి పొట్టలో దాచాడు. కస్టమ్స్ అధికారులు గమనించలేరని భావించాడు. కానీ కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ బంగారం గుట్టు బయటపడింది. నిందితుడు మహ్మద్ అర్షద్ ను అరెస్ట్ చేసి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.