శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2.6 కేజీల1.38 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా దుబాయ్ నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఒక ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి....
దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన నవాజ్ పాషా క్యాప్సూల్స్ లో దాచి బంగారాన్ని తీసుకు వచ్చాడు. అయితే కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇది బయటపడింది. దీని విలువ 1.38 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. నవాజ్ పాషాను అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.