అనంతపురం జేఎన్టీయూలో విద్యార్థి బలవన్మరణం..
గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు మొబైల్ లో స్నేహితుల నంబర్లకు BYE అని సందేశం పంపి..;

Anantapuram JNTU Student Nandareddy
అనంతపురంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున యూనివర్సిటీలోని ఎల్లోరా హాస్టల్ భవనంపై నుండి దూకి ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతుడు ఈసీఈ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థి చాణక్య నందారెడ్డి (19)గా గుర్తించారు.
గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు మొబైల్ లో స్నేహితుల నంబర్లకు BYE అని సందేశం పంపి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నందారెడ్డికి మొదటి సంవత్సరంలో 9.8 జీపీఏ మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి.. అతను చదువు ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడలేదని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. మృతుడి స్వస్థలం నెల్లూరు జిల్లా అని గుర్తించి, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. నందారెడ్డి ఆత్మహత్యకు కారణం ఎవరు ? ఏ విషయానికి బలవన్మరణానికి పాల్పడ్డాడు ? అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.