సచిన్ జోషికి ఈడీ షాక్.. ఆస్తులు జప్తు
సినీ నటుడు, నిర్మాత అయిన సచిన్ జోషికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఊహించని షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన
సినీ నటుడు, నిర్మాత అయిన సచిన్ జోషికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఊహించని షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన ఆస్తులను జప్తు చేసింది ఈడీ. సచిన్ జోషికి సంబంధించిన రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇందులో రూ.330 కోట్ల వరకు ఓంకార్ గ్రూప్‌కు చెందిన ఆస్తులు కాగా, మిగిలిన రూ.80 కోట్లు వైకింగ్ గ్రూప్ కంపెనీకి చెందినవిగా తెలిపింది. ఎస్ఆర్ఏ అనే ప్రాజెక్టులో భాగంగా సచిన్ జోషికి చెందిన ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా సచిన్ జోషి ఆస్తులని జప్తు చేసింది.
కాగా.. సచిన్ జోషి 2002లో మౌనమేలనోయి సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత.. నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, నీజతగా నేనుండాలి, వీడెవడు వంటి పలు సినిమాల్లో నటించాడు. బాలీవుడ్ లోనూ వివిధ సినిమాల్లో నటించాడు. 'నెక్ట్స్ ఏంటి' సినిమాకి నిర్మాతగా, మరికొన్ని సినిమాలకు ఫైనాన్స్ కూడా అందించారు సచిన్.